ఎఫ్టీపీసీ ఇండియా ప్రెసిడెంట్ చైతన్య జంగాకు ఆటా ఆహ్వానం

- March 02, 2024 , by Maagulf
ఎఫ్టీపీసీ ఇండియా ప్రెసిడెంట్ చైతన్య జంగాకు ఆటా ఆహ్వానం

విజయవాడ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావల్సిందిగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చైతన్య జంగాకు ఆహ్వానం లభించింది. జూన్ 7-9 తేదీల్లో అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ నందు 18వ ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ జరుగనున్నాయి. ఈ మహాసభలకు పలువురు సినీ, రాజకీయ, క్రీడా, వాణిజ్య, కళారంగ ప్రముఖులు హాజరుకానున్నట్లు ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని తెలిపారు. తెలుగు సినీ ప్రతిభను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ, మన సినిమాను ప్రపంచ సినిమాతో మమేకం చేసేందుకు కృషి చేస్తున్న చైతన్య జంగాను ఆటా మహాసభలకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆటా కాన్ఫరెన్స్ కు ఆహ్వానం అందటం పట్ల చైతన్య జంగా సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినీ, టీవీ రంగాల గొప్పదనాన్ని ఆటా వేదికగా ప్రపంచానికి చాటి చెబుతానని చైతన్య జంగా ఈ సందర్భంగా వెల్లడించారు. చైతన్య జంగాకు ఆటా ఆహ్వానం అందటం పట్ల బిగ్ బాస్ 6 ఫేమ్ షానీ, ఎఫ్టీపీసీ సెక్రెటరీ వీఎస్ వర్మ పాకలపాటి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com