టూత్ బ్రష్‌తో తస్మాత్ జాగ్రత్త.!

- March 04, 2024 , by Maagulf
టూత్ బ్రష్‌తో తస్మాత్ జాగ్రత్త.!

టూత్ బ్రష్ చేతిలోకి తీసుకోవడంతోనే రోజు స్టార్ట్ అవుతుంది. అంతేకాదు, టూత్ బ్రష్ అంటే కేవలం పళ్లను శుభ్రం చేసే ఓ వస్తువు మాత్రమే కాదండోయ్. మొత్తం శరీర ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసే అపురూపమైన ఆయుధంగా అభివర్ణించవచ్చేమో.

ఇంతకీ టూత్ బ్రష్‌కీ, ఆరోగ్యానికీ సంబంధం ఏంటీ.? అంటారా.? ఆరోగ్యంగా వుండాలంటే, కేవలం పోషకాలున్న శుభ్రమైన ఆహారం తీసుకోవడమే కాదు, వాటిని తీసుకునే పళ్లను జాగ్రత్తగా చూసుకోవడం కూడా.

పళ్లు ఆరోగ్యంగా వుంటేనే మొత్తం శరీరం ఆరోగ్యంగా వుంటుంది. మరి, ఆ పళ్లను శుభ్రం చేసే టూత్ బ్రష్ ఇంకెంత పరిశుభ్రంగా జాగ్తత్తగా వుండాలి.

టూత్ బ్రష్‌ని కొందరు నెలల తరబడి వాడుతుంటారు. టూత్ బ్రష్ పళ్లు అరిగిపోయేవరకూ వాడుతుంటారు. టూత్ బ్రష్‌కున్న పళ్లు అరిగిపోవడం లేదా వంగి విరిగి పోవడం వంటి పరిస్థితుల్లో వుంటే అస్సలు ఆ టూత్ బ్రష్ వాడొద్దని దంత వైత్య నిపుణులు చెబుతున్నారు.

అలా విరిగి, వంగిపోయి వున్న టూత్ బ్రష్‌తో దంతాలను శుభ్రం చేసుకున్నా.. ఏమాత్రం అవి శుభ్రం కావు సరికదా..బ్యాక్టీరియా నిండిపోయి అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది.

అందుకే రెండు మూడు నెలలకోసారి టూత్ బ్రష్ ఛేంజ్ చేయాలి. అలాగే, జలుబు, జ్వరం లేదా.. దంతాలకు సంబంధించి చిగురు వాపు లేదా రూట్ కెనాల్ వంటి ట్రీట్‌మెంట్ చేయించుకుంటే.. ఆ తర్వాత ఖచ్చితంగా టూత్ బ్రష్ మార్చివేయాలని అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com