వెదర్ అలెర్ట్: ఒమన్లో భారీ వర్షాలు
- March 05, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోని వివిధ గవర్నరేట్లలో మార్చి 5 నుండి 20 మిమీ నుండి 60 మిమీ వరకు భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముసందమ్, అల్ బురైమి, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా మరియు అల్ ధాహిరా గవర్నరేట్ల మీదుగా వడగళ్లతో కూడిన భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఉరుములతో కూడిన జల్లులు కురిసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. వాడీలను (ఫ్లాష్ ఫ్లడ్) దాటవద్దని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని, హెచ్చరిక సమయంలో ప్రయాణించవద్దని సూచించింది.
హెచ్చరికలు:
1-వడగళ్లతో కూడిన భారీ ఉరుములతో కూడిన వర్షాలు (20 - 60 మి.మీ.) ఆకస్మిక వరదలకు (వాడీస్) కారణం కావచ్చు.
2-15 - 35 నాట్స్ (28 - 64 కిమీ/గం) వేగంతో బలమైన డౌన్డ్రాఫ్ట్ యాక్టివ్ గాలులు వీస్తాయి.
3-ముసండం గవర్నరేట్ మరియు ఒమన్ సముద్ర తీరాల (2-3.5 మీటర్లు) వెంబడి సముద్ర మట్టం పెరగవచ్చు.
4- ఉరుములతో కూడిన జల్లుల సమయంలో హారిజాంటల్ విజిబిలిటీ తగ్గుతుంది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







