ఏపీ రాజధానిగా విశాఖ.. తేల్చి చెప్పిన సీఎం జగన్
- March 05, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రాజధాని విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. ఎన్నికల తర్వాత ఏపీ రాజధాని విశాఖ పట్టణం ఉంటుందని..
తాను గెలిచిన తర్వాత విశాఖలోనే మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని.. విశాఖలోనే ఉంటానని అన్నారు. అంతకు ముందు.. రాష్ట్ర విభజన కారణంగా కీలకమైన కంపెనీలు 90శాతం హైదరాబాద్ లోనే ఉండిపోయాయని అన్నారు.
అలాగే రానున్న కాలంలో తాను మరోసారి సీఎంగా వచ్చి విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ లా మారుస్తామని, విశాఖను పాలనా రాజధానిగా చేయడం వెనుక నా వ్యక్తిగత స్వార్ధమేమి లేదని చెప్పుకొచ్చారు. అలాగే అమరావతిని తిరిగి రాజధానిగా ఏర్పాటు చేయాలంటే లక్ష కోట్లు అవసరం అన్నారు. కానీ విశాఖలో ఇప్పటికే అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. అందుబాటులో ఉన్న సదుపాలను కాస్త మెరుగుపరిచి విశాఖను అద్బుతమైన పాలనా రాజధానిగా చేయవచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. దీంతో పాటుగా తాను రాష్ట్రంలో అమరావతి సహా ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని, అందుకు అమరావతిని ఏపీ రాజధానిగా ఉంచామని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







