రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వాసి మృతి
- March 06, 2024
మాస్కో: రష్కా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ హైదరాబాద్ నగరానికి చెందిన మహ్మద్ అఫ్సాన్(30) అనే వ్యక్తి చనిపోయాడు.
ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు బుధవారం వెల్లడించారు.
కాగా, రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 20 నుంచి 30 మంది భారతీయులను, సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగుచూసింది.
రష్యా సైన్యంలో ప్రస్తుతం ముగ్గురు హైదరాబాదీలు ఉన్నారు. ఈ ముగ్గురిని భారత్‌కు తీసుకురావాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ భారత విదేశాంగ శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఈ విషాద చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష