TANA బోర్డ్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి
- March 07, 2024
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రతిష్టాత్మకమైన బోర్డ్ చైర్మన్ పదవికి డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ రాత్రి జరిగిన బోర్డ్ సమావేశంలో బోర్డ్ చైర్మన్ ను, కార్యదర్శిని, కోశాధికారిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డ్ కార్యదర్శిగా లక్ష్మి దేవినేని, కోశాధికారిగా జనార్దన్ (జానీ ) నిమ్మలపూడి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ప్రపంచ ప్రతిష్టాకరమైన టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పటిల్ లో పీడియాట్రిక్ కార్డియోవాస్క్యూలర్ అనస్థీషియాలజీ విభాగంలో డాక్టర్ శ్రీనివాస్ గారు సేవలందిస్తున్నారు. అలాగే బేలర్ కాలేజీ అఫ్ మెడిసిన్ లో వైద్య విద్యని బోధిస్తున్నారు. గతంలో తానా బోర్డు కార్యదర్శి గా మరియు ప్రతిష్టాక రమైన తానా- బసవతారకం ప్రాజెక్ట్ కి ముందు ఉండి మార్గదర్శకాలతోపాటు కోటి రూపాయిల నిధిని సమకూ ర్చి బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి వైద్య పరికరాల కొనుగోలుకు తానా ఫౌండేషన్ తరుపున అందించటంలో ముఖ్య భూమిక ఫోషించారు. అలాగే సనాతన హిందూ ధార్మిక కార్య క్రమాలు అయిన వేద పాఠశాలలు, గోశాలలు, గురుకులాల మరియు దేవాలయాల అభివృద్ధికి ఆర్ధిక వనరులు సమకూర్చటంతో పాటు విశేష సేవలందిస్తున్నారు.
బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్మి దేవినేని గతంలో తానా బోర్డు కోశాధికారిగా, న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ గా, విమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గానే కాకుండా 23వ తానా మహా సభలలో పలు కమిటీలలో ఆమె సేవలందించారు.
బోర్డు కోశాధికారిగా ఎన్నికైన జనార్దన్ నిమ్మలపూడి గతంలో 21వ తానా మహాసభల కార్యదర్శిగా, కాపిటల్ రీజియన్ కోఆర్డినేటర్ గానే కాకుండా కాన్సర్ అవగాహన మరియు నిధుల సమీకరణకోసం ప్రపంచం లో ఎత్తైన కిల్మంజారో పర్వతాన్ని అధిరోహించారు.అలాగే ఈ మధ్య జరిగిన 23వ తానా మహాసభలలో ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ కి కోటి రూపాయల నిధిని సమకూర్చడంలో ప్రత్యేక పాత్ర ఫోషించారు. సమన్వయంతో కార్యక్రమాల నిర్వహణ తానా బోర్డు చైర్మన్ గా ఎన్నికైన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు తానా ఫౌండేషన్ ని సమన్వయ పరుచుకుంటూ, సరిఅయిన దిశలో మార్గ నిర్దేశం చేస్తూ తానా సేవలను కమ్యూనిటీకి సమర్ధవంతంగా అందేలా కృషి చేస్తానని చెప్పారు. బోర్డు అఫ్ డైరెక్టర్స్ తమ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా తానా ప్రతిష్టని ఇనుమడింపచేస్తు, తెలుగు వారికి మరింత చేరువ చేయటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కూడా తెలిపారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







