మహిళా దినోత్సం ముందు రోజున అక్కచెల్లెమ్మలకు ఆర్థికసాయం: సిఎం జగన్
- March 07, 2024
అమరావతి: అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.5,060.49 కోట్ల నగదు బదిలీ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల వయసు గల 26,98,931 మంది మహిళల ఖాతాల్లోకి రూ.18,750 చొప్పున జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..చేయూత పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75 వేలు ఇస్తున్నామని చెప్పారు. మహిళా దినోత్సం ముందు రోజున అక్కచెల్లెమ్మలకు ఆర్థికసాయం చేయడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. తమ ఐదేళ్ల పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశామని చెప్పారు. ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతుందని సీఎం జగన్ వివరించారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్థికసాయం అందిస్తూ అక్కచెల్లెమ్మలను ఆదుకుంటున్నామని, అందుకు తాను గర్విస్తున్నానని తెలిపారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఏపీ ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ప్రారంభించింది. గత మూడు విడతల్లో ఒక్కొక్క మహిళకు రూ.56,250 మేర లబ్ధి చేకూరింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







