సరికొత్త టెక్నాలజీతో అగ్ని-5 మిస్సైల్ రెడీ : ప్రధాని మోదీ కీలక ప్రకటన
- March 11, 2024
న్యూడిల్లీ: పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసారు. డిఆర్డివో శాస్త్రవేత్తలు మిషన్ దివ్యాస్త్రను రూపొందించినట్లు ప్రధాని ప్రకటించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ (MIRV) టెక్నాలజీతో దేశీయంగానే అగ్ని-5 మిస్సైల్ ను రూపొందించినట్లు ప్రధాని ట్వీట్ చేసారు.
ఇవాళ(సోమవారం) అగ్ని-5 మిస్సైల్ ను శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రధాని మోదీ దీనిపై ప్రకటన చేసినట్లుగా సమాచారం. దేశీయ టెక్నాలజీతో రూపొందించిన ఈ అగ్ని -5 క్షిపణిని వాయుమార్గం ద్వారా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ మిస్సైల్ తో ఏకకాలంలో వివిధ లక్ష్యాలను చేధించవచ్చని తెలుస్తోంది.
డిఆర్డివో (డిఫెన్స్ రీసెర్చ్ ఆండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) ఈ అగ్ని 5 క్షిపణిని రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఓ మహిళా శాస్త్రవేత్త వున్నట్లు తెలుస్తోంది. అనేక మంది మహిళలు ఈ ప్రాజెక్ట్ లో పనిచేసినట్లు సమాచారం.
మిషన్ దివ్యాస్త్ర ద్వారా రూపొందించిన అగ్ని-5 క్షిపణి చాలా ప్రత్యేకమైనదిగా తెలుస్తోంది. ఈ క్షిపణి రూపకల్పన ద్వారా ఇండియా మల్టిపుల్ ఇండడిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వి) టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేసింది. ఈ మిస్సైల్ ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కావడమే కాదు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో దేశం మరో ముందడుగు వేసింది.
తాజా వార్తలు
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..









