ఇంటికో ఇంకుడు గుంత, ..
- June 04, 2016
ఇంటికో ఇంకుడు గుంత, పొలానికో పంటకుంట, ప్రతి వూరికి ఓ వనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యి మొక్కలు నాటాలని జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. నవ నిర్మాణ దీక్ష మూడో రోజు కార్యక్రమాలకు సంబంధించి మొత్తం 6వేల మందితో ఒకేసారి ఆయన నివాసం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్లో సంతోషం, సంతృప్తి స్థాయిలు పెంచే లక్ష్యంతో అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.
రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు అభినందిస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలను ప్రశంశిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న పంచాయతీలకు, స్థానిక సంస్థలకు నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని తెలిపారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలకు రూ.5లక్షలు, వంద పంటకుంటలు తవ్విన గ్రామాలకు రూ.4లక్షలు, ఇంటికో ఇంకుడుగుంత సాధించిన గ్రామాలకు రూ.2లక్షలు, 50 వర్మీకంపోస్టు యానిట్లు ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు రూ.2లక్షలు చొప్పున ఇస్తామని సీఎం ప్రకటించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







