మృణాల్ ఠాకూర్ జోరు హుషారు.!
- March 12, 2024
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తొలి సినిమా సంచలన విజయం అందుకుంది. ఆ తర్వాత నుంచీ ఆమె క్రేజ్ వేరే లెవల్‌కి చేరుకుంది.
అంతేకాదు, ఆమె ఎంచుకుంటున్న సినిమాలు కూడా వరుసగా సూపర్ హిట్స్ అవుతుండడంతో మృణాల్ పేరు టాలీవుడ్లో మార్మోగిపోతోంది. లేటెస్ట్గా ‘హాయ్ నాన్న’ సినిమాతో నేచురల్ స్టార్ నానికి హిట్టిచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమా ప్రోమోలు ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయ్. దాంతో, సినిమాపై పాజిటివ్ సైన్ ఏర్పడింది. ఏప్రిల్‌లో ‘ఫ్యామిలీ స్టార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో యాక్టివ్‌గా పాల్గొంటోంది మృణాల్ ఠాకూర్. ఆ సంగతి అటుంచితే, మృణాల్ తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తి నెలకొంది.
మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ చేయబోయే సినిమా కోసం ప్యాన్ ఇండియా స్టార్‌తో జత కట్టబోతోందనీ తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు, ప్రబాస్.
ప్రబాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోందని ఇన్సైడ్ సోర్సెస్ సమాచారం. మృణాల్తో ‘సీతారామం’ వంటి సూపర్ హిట్ కొట్టిన హను రాఘవపూడి.. తన తదుపరి సినిమాలోనూ లక్కీ బ్యూటీ మృణాల్‌నే ఎంచుకోబోతున్నాడనీ సమాచారం.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









