కుప్పకూలిన రష్యా మిలిటరీ కార్గో విమానం.. 15 మంది దుర్మరణం..
- March 12, 2024
రష్యా: టేకాఫ్ సమయంలో 15 మందితో వెళ్తున్న రష్యన్ IL-76 మిలిటరీ కార్గో విమానం కూలిపోయింది.మాస్కోకు ఈశాన్యంలో ఉన్న ఇవానోవో ప్రాంతంలోని ఎయిర్ ఫీల్డ్ నుంచి టేకాఫ్ అవుతుండగా మంగళవారం విమానం కూలిపోయినట్లుగా రష్యా తెలిపింది.
8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఉన్న వారంతా మరణించినట్లు సమాచారం.
టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఇంజన్లలో మంటలు వ్యాపించాయి. దీంతో విమానం కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతం ఇవానోవో ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 700 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంది.
ఇటీవల రష్యాలో విమాన ప్రమాదాలు అనుమానాస్పదంగా మారుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధ వేళ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. రష్యా అధినేత పుతిన్‌కి ఎదురుతిరిగిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ కూడా ఇలాగే అనుమానాస్పదం విమాన ప్రమాదంలో మరణించారు. ఆగతంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తీసుకెళ్తున్న విమానం కూడా ఇలాగే ఉక్రెయిన్ సరిహద్దులోని రష్యా ప్రాంతంలో కుప్పకూలింది.ఈ సమయంలో ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







