టిఫిన్ బాంబుల్ని స్వాధీనం
- June 04, 2016
గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన టిఫిన్ బాంబు పేలడంతో ఓ లారీ దగ్ధమైంది. ఈ ఘటన తమిళనాడులోని మధుర సమీపంలో వైగై నదీ తీరంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులెవరో ఒక లారీని లక్ష్యంగా చేసుకుని ఈ పనిచేశారు. కొంత మందుగుండు సామగ్రిని టిఫిన్ బాక్సులో పెట్టి దాన్ని లారీ సమీపంలో పడేశారు. దీంతో అది పేలి స్టేషనరీ వస్తువులతో ఉన్న లారీ పాక్షికంగా ధ్వంసమైంది. ఈ బాంబు అంత శక్తిమంతమైనదేమీ కాదని పోలీసులు తెలిపారు. అందువల్ల ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని చెప్పారు. గత పదేళ్లలో పోలీసులు మధురై, ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ఐదు టిఫిన్ బాంబుల్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







