సౌదీ GDPలో 50%కి చమురేతర కార్యకలాపాలు..!

- March 15, 2024 , by Maagulf
సౌదీ GDPలో 50%కి చమురేతర కార్యకలాపాలు..!

రియాద్: సౌదీ అరేబియాలో చమురేతర కార్యకలాపాలు 2023 సంవత్సరంలో వాస్తవ స్థూల జాతీయోత్పత్తి (GDP)లో 50 శాతానికి చేరాయి. ఇది ఇప్పటివరకు అత్యధిక చారిత్రక స్థాయి కావడం గమనార్హం. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) నివేదిక వెల్లడించింది. చమురుయేతర ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం విలువను స్థిరమైన ధరల వద్ద SR1.7 ట్రిలియన్‌లుగా పేర్కొంది. ఇది పెట్టుబడి, వినియోగం మరియు ఎగుమతులలో నిరంతర వృద్ధి ద్వారా సాధ్యమైందని తెలిపింది. చమురుయేతర కార్యకలాపాల యొక్క ఈ చారిత్రాత్మక సహకారం గత రెండేళ్ళలో అపూర్వమైన ప్రభుత్వేతర పెట్టుబడులకు దక్కిన ఫలితం అని, ఇది 57 శాతం పెరిగిందని వెల్లడించింది. ప్రభుత్వేతర పెట్టుబడుల విలువ 2023లో వాటి అత్యధిక స్థాయి SR959 బిలియన్లకు చేరుకుందని తెలిపింది. ఆర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్ కార్యకలాపాలు 2021 మరియు 2022 సంవత్సరాలలో 106 శాతం వృద్ధిని సాధించాయని పేర్కొంది. అదే సమయంలో వసతి, ఆహారం, రవాణా, సేవలు వంటి ఇతర కార్యకలాపాలలో 77 శాతానికి (29 శాతం వృద్ధి)చేరాయని, ఆరోగ్యం, విద్య మరియు వినోదం వంటి సామాజిక సేవలు 10.8 శాతం వృద్ధిని నమోదు చేసినందున, రవాణా మరియు కమ్యూనికేషన్‌లు 7.3 శాతం.. రెస్టారెంట్లు, హోటళ్లు 7 శాతం వృద్ధి సాధించాయని తెలిపింది. రియల్ సర్వీస్ ఎగుమతులు, ఇన్‌బౌండ్ టూరిస్ట్‌ ల పరంగా గత రెండు సంవత్సరాలలో చారిత్రాత్మక వృద్ధి రేటును(319 శాతం) నమోదు చేశాయని, ఇది పర్యాటకం మరియు వినోదం కోసం ప్రపంచ గమ్యస్థానంగా సౌదీ అరేబియా మారుతుందని పేర్కొంటుందని వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com