రమదాన్ విరాళాల ప్రచారాలలో పిల్లలు.. మంత్రిత్వ శాఖ వార్నింగ్
- March 17, 2024
రియాద్: వాణిజ్య మార్కెటింగ్, ప్రకటనలలో పిల్లలను వాడుకోవడానికి వ్యతిరేకంగా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) హెచ్చరిక జారీ చేసింది. బాలల రక్షణ చట్టంలోని ఆర్టికల్ మూడు, దాని నిబంధనలను అమలు చేయడంలో భాగంగా తాజా ఉత్తర్వులను జారీ చేసినట్లు వెల్లడించింది. ఆందోళన, ఒత్తిడి, బెదిరింపులకు గురికావడం వంటి వాటితో సహా పిల్లలపై ప్రతికూల ప్రభావాలపై చూపడంపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ముఖ్యంగా రమదాన్ విరాళాల ప్రచారాలలో లాభాపేక్షలేని సంస్థలు పిల్లలను ఉపయోగించడాన్ని ఇటీవలి గుర్తించారు. ఇవి చట్టానికి విరుద్ధమైన చర్యలుగా పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని, 19911 నంబర్‌ను సంప్రదించడం ద్వారా లేదా దాని మొబైల్ యాప్ ద్వారా పిల్లల దోపిడీకి సంబంధించిన ఏవైనా సందర్భాలను నివేదించాలని కమ్యూనిటీని కోరింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు