హనుమాన్ ఓటీటీ ఆలస్యం అందుకేనా.?
- March 19, 2024
ధియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఏ సినిమా అయినా ఓటీటీలో ప్రత్యక్షం కావల్సిందే. ఇదీ నయా ట్రెండ్. కొన్ని సినిమాలైతే రెండు మూడు వారాలకే ఓటీటీలో దర్శనమిస్తోంది.
అయితే, ఇంతవరకూ ఏ సినిమాకీ ఇంత టైమ్ తీసుకోలేదు ఓటీటీ రిలీజ్‌కి ఒక్క ‘హనుమాన్’ సినిమాకి తప్ప. స్టార్ హీరోల సినిమాలే నాలుగు నుంచి ఆరు వారాలలో ఓటీటీలో రిలీజ్ అయిపోయాయ్.
సంక్రాంతికి రిలీజ్ అయిన ‘హనుమాన్’ సినిమా ఇంకా కొన్ని చోట్ల ధియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండడం విశేషం. ఎట్టకేలకు హిందీ వెర్షన్ ‘హనుమాన్’ అయితే ఓటీటీలో రిలీజైంది.
తెలుగు వెర్షన్‌కి ఇంకా టైమ్ పట్టే అవకాశాలున్నాయట. ఇంత ఆలస్యం చేసినందుకు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నాడట ప్రశాంత్ వర్మ ఫ్యాన్స్‌కి నచ్చే విధంగా.
అదేంటంటే, కొన్ని అన్‌కట్ సీన్లనూ, ఓ పవర్ఫుల్ సూపర్ మేన్ సాంగ్‌నీ ఓటీటీ వెర్షన్ కోసం యాడ్ చేయబోతున్నాడనీ సమాచారం. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమైందనీ ప్రచారం జరుగుతోంది. నిజంగానే సీన్లు యాడ్ చేసి ‘హనుమాన్’ని కొత్తగా ఓటీటీలో రిలీజ్ చేస్తారా.? లేదంటే ఆలస్యానికి చింతిస్తున్నాం.. అనే కవరింగ్ యవ్వారమా.? త్వరలోనే తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా
- దోహా ఫోరమ్‌ను ప్రారంభించనున్న అమీర్..!!
- ఈయూ చట్టాలతో జీసీసీ కంపెనీలకు నష్టం..!!
- బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!
- ఒమన్ లో సామాజిక సమైక్యతగా స్వచ్ఛంద సేవ..!!
- కువైట్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం..!!
- 10-గంటల నిరీక్షణ.. ఇండిగో యూఏఈ-ఇండియా సర్వీసు ఎఫెక్ట్..!!
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం







