స్కెంజెన్ వీసా మినహాయింపు.. చర్చించిన జీసీసీ, ఈయూ
- March 20, 2024
బ్రస్సెల్స్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) రాష్ట్రాల పౌరులకు స్కెంజెన్ వీసా మినహాయింపు ఇచ్చే అంశంపై జిసిసి -యూరోపియన్ యూనియన్ సీనియర్ అధికారులు చర్చించారు. జిసిసి సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్బుదైవి, యూరోపియన్ ఎక్స్టర్నల్ యాక్షన్ సర్వీస్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్రిక్ మోరా బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో చర్చలు జరిపారు. జిసిసి మరియు యూరోపియన్ యూనియన్ మధ్య సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై వారు చర్చించారు. ఈ సమావేశంలో జీసీస, ఈయూ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..స్కెంజెన్ వీసా నుండి గల్ఫ్ దేశాల పౌరులను మినహాయించే ప్రక్రియతో సహా ద్వైపాక్షిక గల్ఫ్-యూరోపియన్ సంబంధాలకు సంబంధించిన ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు గాజా స్ట్రిప్‌లోని పరిణామాలు, భద్రత మరియు స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు