కీర్తి సురేష్-సుహాస్ కాంబినేషన్.! ఇదో అద్భుతమే.!
- March 20, 2024
కీర్తి సురేష్ అంటే మహానటి. కానీ, కంటెంట్ నచ్చితే.. తన స్థాయిని కూడా మరిచిపోయి ఆయా కథల్లో తన సత్తా చాటుతుంటుంది. ‘మహానటి’ సినిమాతో ఆ స్థాయి స్టార్డమ్, స్టేటస్ అందుకున్నప్పటికీ.. కీర్తి సురేష్ ఎంచుకునే కథలు కొన్ని సందర్భాల్లో మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంటాయ్.
అలాంటిదే ఆమె నటించిన ‘చిన్ని’ మలయాళ చిత్రం. డీ గ్లామర్ రోల్లో నటించి వావ్ అనిపించింది ఈ సినిమాలో కీర్తి సురేష్. అలాగే, ఇప్పుడు మరో సినిమాలోనూ కీర్తి సురేష్ నటిస్తోంది.
చాలా తక్కువ స్కేల్ వున్న సినిమా. ఇది. అంతేకాదు, ధియేట్రకిల్ మూవీ కూడా కాదండోయ్. జస్ట్ ఓటీటీ సినిమా. సినిమా పేరు ‘ఉప్పు కప్పురంబు’. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ హీరోగా నటిస్తున్నాడు.
కంటెంట్ నచ్చడంతో, కీర్తి సురేష్‌ని సంప్రదించారట. వెంటనే కీర్తి సురేష్ ఓకే చెప్పేసిందట. అలా ఈ ఓటీటీ మూవీకి మహానటి ఎంపికైంది. సుహాస్ సినిమాలో కీర్తి సురేష్ అనే టాక్ విశేషమైంది.
అన్నట్లు కీర్తి సురేష్ మరో ఓటీటీ సినిమాలోనూ నటిస్తోందండోయ్. దాని పేరు ‘అక్క’. రాధికా ఆప్టే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు