ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్
- March 22, 2024
ముంబై: కొత్త ఆర్ధిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో కొన్ని మార్పులు రానున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంకాక్ వంటి ప్రధాన బ్యాంక్ లు లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్ల విషయంలో మార్పులు తీసుకు వస్తున్నాయి. దీనిపై ఆయా బ్యాంక్‌లు కార్డుదారులకు సమాచారం అందించాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్ల విధానంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందిస్తున్న ర్యాంక్ ఇకపై ఈ చెల్లింపులకు రివార్డు పాయిం ట్లను నిలిపివేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు వర్తించను న్నాయి. ఎస్బీఐ అంది స్తున్న అన్ని అరుమ్, ఎస్బీఐ కార్టోలైట్, సింప్లీ క్లిక్ కార్డులు వినియోగిస్తున్న వారికి ఈ కొత్త నిబం ధన వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్లాంజ్ యాక్సెస్ విష యంలో నిబంధనలను సవరించింది. రానున్న తైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే అంతకు ముందు త్రైమాసికంలో కనీసం 35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్, ప్లాటినం క్రెడిట్ కార్డుతో పాటు అన్ని రకాల కార్డులకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. యస్ బ్యాంక్ కూడా లాంజ్ యాక్సెస్ లో నిబంధనలను సవరిం చింది. అంతకు ముందు త్రైమాసికంలో 10,000 వ్యయం చేసిన వారికి లాంజ్ యాక్సెస్ ఇవ్వనుం ది. యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్ల, లాంజ్ యాక్సెస్‌తో పాటు వార్షిక యసుములో కీలక మార్పులు చేసింది. బీమా, గోల్డ్ ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి అవార్డు పాయింట్ల ఇవ్వడంలేదని తెలిపింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు