‘గేమ్ ఛేంజర్’.! అప్పుడైనా ఆ అప్డేట్ వదులుతారా.? లేదా.?
- March 23, 2024
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అనేక రకాల సెలబ్రేషన్లు ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. వాటితో పాటూ, ఆయన నటిస్తున్న సినిమాల నుంచి సరికొత్త అప్డేట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
‘గేమ్ ఛేంజర్’ సినిమా వైజాగ్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ‘జరగండి..’ అనే సాంగ్ అప్పట్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.
ఈ సారి పక్కా అంటున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ‘జరగండి..’ లిరికల్ సాంగ్‌ని ఫ్యాన్స్ హుషారెత్తేలా రిలీజ్ చేయబోతున్నారట. అంతే కాదు, మరిన్ని అప్డేట్లు ఆ రోజే ప్లాన్ చేస్తున్నారట.
లేటెస్ట్గా బుచ్చిబాబు సన కాంబో మూవీ కూడా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే పూజా కార్య క్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూట్ వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు