చివరకు విశాఖను గంజాయి కాపిటల్ గా మార్చేశారు: భువనేశ్వరి
- March 23, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నమే రాజధాని అని అంటూ చివరకు గంజాయికి కాపిటల్ గా మార్చేశారని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై నారా భువనేశ్వరి మండిపడ్డారు. రాజధానిని చేస్తామన్న నేతలు ఇన్నేళ్లయినా ఎక్కడా ఒక్క ఇటుక కూడా వేయలేదేంటా అని మనం అనుకున్నాం కానీ విశాఖను గంజాయి కాపిటల్ గా ఎప్పుడో మార్చేశారని చెప్పారు. ఈ విషయం మనమే అర్థం చేసుకోలేదన్నారు. రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును ఫణంగా పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో, ఏమనుకోవాలో తెలియట్లేదని వాపోయారు.
మొన్నటికి మొన్న ఒకే ఒక్క కంటైనర్ లో వేల కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్తలు మనమంతా చూశామని చెప్పారు. ఈ లక్షల కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి సమాజంలోకి వస్తే మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రజలకు నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఓ వీడియో సందేశాన్ని నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు