దుబాయ్ లో మూడు అద్దె కార్ల సంస్థలు సీజ్.. Dh10,000 జరిమానా

- March 25, 2024 , by Maagulf
దుబాయ్ లో మూడు అద్దె కార్ల సంస్థలు సీజ్.. Dh10,000 జరిమానా

దుబాయ్: వినియోగదారుల రక్షణ హక్కులకు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించినందుకు 2023-24లో మూడు దుబాయ్ కార్ రెంటల్ కంపెనీలను సీజ్ చేసినట్లు ఆర్థిక మరియు పర్యాటక శాఖ తెలిపింది. సదరు కంపెనీలపై 10,000 దిర్హామ్‌ల వరకు జరిమానాలు విధించినట్లు పేర్కొంది. ఉల్లంఘన పునరావృతమైతే, ప్రతిసారీ జరిమానా రెట్టింపు అవ్వడంతోపాటు కఠిన చర్యలు చేపడుతామని దుబాయ్‌లోని ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్‌మెంట్‌లో వినియోగదారుల రక్షణ డైరెక్టర్ అహ్మద్ అలీ మౌసా చెప్పారు. ఇటీవల, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం కింద పనిచేసే దుబాయ్ కార్పొరేషన్ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ ఫెయిర్ ట్రేడ్.. వాహనాన్ని తిరిగి ఇచ్చిన 30 రోజులలోపు కస్టమర్ల డిపాజిట్‌లను తిరిగి ఇవ్వాలని అన్ని వాహనాల అద్దె సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది.  రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకారం.. దుబాయ్ కార్ రెంటల్ పరిశ్రమ 2022 మొదటి అర్ధభాగంలో నమోదైన కంపెనీల సంఖ్యలో 23.7 శాతం వృద్ధిని నమోదు చేసింది.  అయితే, కార్ వాషింగ్ కోసం విపరీతంగా వసూలు చేసినందుకు కొన్ని కార్ల అద్దె సంస్థలపై డిపార్ట్‌మెంట్ జరిమానా విధించిందని మౌసా వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com