అమెరికా మార్కెట్లోకి అమూల్ పాలు
- March 26, 2024
భారతదేశంలో అతిపెద్ద పాల ఉత్పత్తుల బ్రాండ్ అమూల్.. అతి త్వరలో అమెరికా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. వారం రోజుల్లో కంపెనీకి చెందిన తాజా పాల ఉత్పత్తులను అమెరికాలో విడుదల చేయనున్నట్లు అమూల్ బ్రాండ్ నిర్వహణదారైన గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎ్‌ఫ) తెలిపింది. దీని కోసం 108ఏళ్ల చరిత్ర కలిగిన మిషిగన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పాల సేకరణ, ప్రాసెసింగ్ విధానాన్ని ఆ అసోసియేషన్ చూసుకుంటుందని వెల్లడించారు. త్వరలో పన్నీరు, పెరుగు, మజ్జిగను కూడా ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
దశాబ్దాలుగా డైరీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నప్పటికీ తాజా పాలను విదేశాల్లో లాంచ్ చేయడం మాత్రం ఇదే తొలిసారని జీసీఎంఎంఎఫ్ ఎండీ జయేన్ మెహతా అన్నారు. యూఎ్‌సలోని భారతీయులు, మిగతా ఆసియా దేశాల వారి కోసం వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన చెప్పారు. అమూల్ తాజా, గోల్డ్, శక్తి, స్లిమ్ అండ్ ట్రిమ్ పాలప్యాకెట్లను న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్ తదితర నగరాల్లో విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో జీసీఎంఎంఎఫ్ టర్నోవర్ వార్షిక ప్రాతిపదికన 18.5 శాతం వృద్ధితో రూ.55,000 కోట్లకు చేరుకుంది. ఈ సంస్థ ఇప్పటికే 50 దేశాలకు డైరీ ఉత్పత్తులను ఎగమతి చేస్తోంది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







