బర్త్ డే స్పెషల్.! గ్లోబల్ స్టార్ వస్తున్నాడు ‘జరగండి..జరగండి.!’
- March 27, 2024
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులు అనేక సేవా కార్యక్రమాలను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. ఓ పక్క ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయ్. మరో పక్క ఆయన చేయబోయే కొత్త సినిమాల అప్డేట్ల కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురు చూశారు.
ఆ ఎదురు చూపులు ఫలించాయ్. ఆయన నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. అదే ‘జరగండి.. జరగండి..’ లిరికల్ సాంగ్. ప్రభుదేవా కొరియోగ్రఫీలో డిజైన్ చేయబడిన ఈ సాంగ్‌లో రామ్ చరణ్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తున్నారు.
జోడీగా కియారా అద్వానీ అందాలు ఈ పాటకు మరో ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తున్నాయ్. ‘సిక్స్ ప్యాక్‌లో యముడండీ.. సిస్టమ్ మారితే మొగుడండీ..’ అంటూ సాగే లిరిక్స్‌తో బీభత్సమైన ఐ పీస్ట్ కానుంది ఈ సాంగ్ స్ర్కీన్‌పై అనిపించేలా వుంది.
థమన్ అందించిన మ్యూజిక్ అంత ఎఫెక్టివ్‌గా వున్నా లేకపోయినా.. శంకర్ మార్క్ విజువల్స్ మాత్రం బీభత్సంగా వుండబోతున్నాయని ఈ సాంగ్ కోసం వేసిన సెట్ చెబుతోంది. దాదాపు 16 కోట్ల బడ్జెట్‌తో ఈ సాంగ్‌కి ప్రత్యేకమైన సెట్ వేశారట.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు