‘ఫ్యామిలీ స్టార్’కి మ్యూజిక్ మైనస్ అవుతుందా.? లేక.!
- March 27, 2024
ఏదో ఒక నెగిటివిటీతోనే పబ్లిసిటీ స్టార్ట్ అవుతోందిప్పుడు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ హాట్ టాపిక్ అవుతోంది. అందుకు కారణం ఆ సినిమాకి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్.
గోపీ సుందర్ మ్యూజిక్ అంటే బ్యూటిఫుల్ మెలోడీస్ గుర్తొస్తాయ్. ముఖ్యంగా విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాకి గోపీసుందర్ ఇచ్చిన మ్యూజిక్ అల్టిమేట్. అటు యూత్‌తో పాటూ అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకర్షించింది ఈ సినిమాలో మ్యూజిక్.
ఇప్పుడు ఇదే కాంబినేషన్లో వస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీకి మాత్రం ఈయన మ్యూజిక్ మైనస్ అయ్యేలా వుంది. ఇంతవరకూ మూడు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయ్. మూడింటికి మూడూ పాత పాటల మ్యూజిక్‌నే తలిపిస్తున్నాయ్.
ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. కాపీ ట్యూన్లు కొట్టేస్తూ.. కాన్సన్ట్రేషన్ తప్పేశాడు గోపీ సుందర్ అంటూ ఆయన్ని కామెంట్ చేస్తున్నారు. అయితే, సినిమా హిట్టయ్యిందంటే కొట్టుకెళ్లిపోద్ది. ఏమైనా తేడా కొట్టిందా.? అంతే సంగతి. చూడాలి మరి. ఏం జరుగుతుందో. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు