ఉలవలతో ఆరోగ్యం.! ఇది మీకు తెలుసా.?

- March 27, 2024 , by Maagulf
ఉలవలతో ఆరోగ్యం.! ఇది మీకు తెలుసా.?

ఉలవచారు చాలా ఫేమస్. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే ఉలవచారును ఇష్టపడతారు. కానీ, ఉలవలు ఏ రకంగా తీసుకున్నా.. ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా నరాల బలహీనత వువ్నవారికి ఉలవలు చేసే మేలు అంతా ఇంతా కాదు. మెదడు నుంచి సంకేతాలను శరీర భాగాలకు చేరవేయడంలో నరాల పాత్ర కీలకం.
నరాలు యాక్టివ్‌గా పని చేస్తేనే శరీరం అంతా యాక్టివ్‌గా ఆరోగ్యంగా వుంటుంది. జీవక్రియలు సక్రమంగా జరుగుతాయ్.  మరి, ఆ నరాలు యాక్టివ్‌గా వుండాలంటే డైట్‌లో ఉలవల్ని ఖచ్చితంగా చేర్చుకోవాలి.
మెదడు కణాలను, నరాల కణాలను డీటాక్సిఫికేషన్ చేయడంలో ఉలవలు ఎంతగానో సహాయపడతాయని తాజా అధ్యయనాల్లో తేలింది. మెదడు, నరాల కణాల్లో ఎప్పటికప్పుడు కొన్ని హాని కలిగించే ప్రొటీన్స్ పేరుకుపోతుంటాయ్.
ఇవి కణాల పని తీరును నెమ్మదిగా దెబ్బ తీస్తుంటాయ్. ఇలాంటి హానికారక ప్రొటీన్స్‌ని తొలగించి కణాల్ని ఆరోగ్యంగా వుంచడంలో ఉలవలు తోడ్పడతాయ్.
ఉలవల్లో ఇనులిన్ అనే ఫైబర్ వుంటుంది. ఈ ఫైబర్ పేగుల్లోకి వెళ్లిన తర్వాత మన పేగుల్లో వుండే మంచి బాక్టీరియా ఈ ఫైబర్‌ని పులియబెట్టి ఇనోసిటాల్ అనే రసాయనాన్ని తయారు చేస్తుంది.ఈ రసాయన సమ్మేళనం నరాల్లో పేరుకుపోయిన హానికారకమైన ప్రొటీన్లను తొలగించి నరాల కణాలను ఆరోగ్యంగా వుంచుతుంది.
అందుకే ఖచ్చితంగా ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవాలని సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com