పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?

- March 28, 2024 , by Maagulf
పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?

యూఏఈ: యువతపై సోషల్ మీడియా ప్రభావంపై ప్రపంచవ్యాప్త ఆందోళనల మధ్య, ఇటీవల ఫ్లోరిడా బిల్లు యూఏఈలోని నిపుణులలో చర్చలను రేకెత్తించింది. ఈ బిల్లు 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నిషేధిస్తుంది.  కొందరు దీనిని స్వాగతించారు. స్థానికంగా ఇదే విధమైన విధానాన్ని కోరగా, మరికొందరు దానిని ఖండించారు.  సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించడం కంటే వాటి యొక్క హానికరమైన ప్రభావాల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. " బిల్లు మంచి ఆలోచన. ఇది చిన్న వయస్సులోనే సోషల్ మీడియా హానికరమైన ప్రభావాల నుండి పిల్లలను రక్షించడానికి ఉద్దేశించబడింది. అయితే, వారిని పూర్తిగా దూరంగా పెట్టకుండా..సోషల్ మీడియా కంటెంట్ హానికరమైన ప్రభావాల గురించి వారికి వివరించాలి. " అని సేజ్ క్లినిక్‌లోని చిల్డ్రన్ అండ్ అడోలెసెంట్ సర్వీసెస్ లీడ్, క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ షార్లెట్ కజిన్స్ అన్నారు. దుబాయ్‌కి చెందిన ఆరోగ్య సంరక్షణ నిపుణుడు  ఫిజియోవేద మెడికల్ సెంటర్ వ్యవస్థాపకుడు అమిత్ సరస్వత్ మాట్లాడుతూ.. పిల్లలలకు పరిమితంగా ఫోన్ల వినియోగానికి అలవాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ బెదిరింపులు, తగని కంటెంట్, సామాజిక ఒంటరితనానికి దారితీసే వ్యసనం నుండి చిన్నారులను రక్షించడమే లక్ష్యంగా ఫ్లోరిడా బిల్లు తీసుకొచ్చిందని వివరించారు.  ఇదే బాటలో యూఏఈ కూడా ఇలాంటి చట్టాన్ని తీసుకురావాలని సూచించారు.   అయితే, ఇటువంటి పూర్తి నిషేధాలు హానికరం అని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సానుకూల ఉపయోగాలు, నష్టాల గురించి పిల్లలకు తెలియజేయాలని బ్రైటన్ కాలేజ్ అబుదాబి హెడ్ మాస్టర్ స్కాట్ కార్నోచన్ అన్నారు. యువత సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకునేలా చేయడంలో తల్లిదండ్రులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని నిపుణులు అంగీకరిస్తున్నారు. తల్లిదండ్రులు కొన్ని నియమాలు మరియు నిబంధనలను నిర్దేశించాలని డాక్టర్ షార్లెట్ అన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com