పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- March 28, 2024
జెడ్డా: ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని జోర్డాన్ లోయలో 8,000 డనుముల భూమిని ఇజ్రాయెల్ జప్తు చేయడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భూమిని జప్తు చేయడం గురించి స్పందించింది. ఇది అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలను, ఇజ్రాయెల్ ఆక్రమణ యొక్క కఠోరమైన పద్ధతులను పొడిగించడమేనని పేర్కొంది. సౌదీ అరేబియా అటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలను ఉల్లంఘిస్తాయని తద్వారా అంతర్జాతీయ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను బలహీనపరుస్తుందని పేర్కొన్నది. ఇది స్థిరమైన శాంతి అవకాశాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేస్తుంది. ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు