మద్దతు కోరుతూ…వాట్సాప్ నెంబర్ షేర్ చేసిన కేజ్రీవాల్ భార్య
- March 29, 2024
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన భార్య సునితా కేజ్రీవాల్ ఈరోజు కోరారు. ఈ నేపథ్యంలో ఓ వాట్సాప్ నెంబర్‌ను ఆమె షేర్ చేశారు. ఆమ్ ఆద్మీ నేతకు మెసేజ్‌లు చేయాలని ఆ నెంబర్‌ను ఆమె వెల్లడించారు. కేజ్రీవాల్‌ను ఆశీర్వదించాలని డ్రైవ్ చేపడుతున్నామని, 8297324624 వాట్సాప్ నెంబర్‌కు మీ దీవెనలు, ప్రార్థనలను మెసేజ్ చేయాలని, మీరు ఎటువంటి మెసేజ్ చేయాలనుకున్నా చేయవచ్చు అని సునితా కేజ్రీవాల్ తెలిపారు. గురువారం కూడా సునితా కేజ్రీవాల్ ఓ వీడియో మెసేజ్‌ను చేశారు. ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త ఆరోగ్యం సరిగా లేదని ఆమె ఆ సందేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ స్కామ్‌లో కేజ్రీని మార్చి 21వ తేదీన అరెస్టు చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఆయన కస్టడీని పొడిగించారు. ఇదే కేసులో ఆ పార్టీకి చెందిన నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!