రాజస్థాన్ అవతరణ దినోత్సవం
- March 30, 2024
భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వం ఇప్పటి రాజస్థాన్‌ను రాజ్పుత్నా అని పిలిచేవారు. రాజ్పుత్నాలో 22 రాజ్యాలు ఉండేవి. రాజ్పుత్నాను స్వతంత్ర భారతదేశ ప్రావిన్స్‌గా మార్చడం, అప్పటి రాజ్పుత్నాలో కొంత భాగాన్ని భారతదేశంలో విలీనం చేయడం చాలా కష్టమైన పని అప్పటి పాలకులు భావించారు.
స్వతంత్ర రాష్ట్రంలో కూడా తమ అధికారాన్ని నిలుపుకోవటానికి రాజ్పుత్నా పాలకులు ప్రయత్నించారు.అందులో భాగంగానే అక్కడ ఉన్న 22 రాజ్యాలను పాలిస్తున్న స్థానిక రాజులు, చక్రవర్తులు స్వయం ప్రతిపత్తి కోసం ఒకానొక దశలో పాకిస్తాన్ లో సైతం కలిసేందుకు సిద్ధపడ్డారని చరిత్రకారులు పేర్కొన్నారు.
అజ్మీర్-మెర్వారా ప్రావిన్స్ బ్రిటిష్ ఆక్రమణలో ఉండేది. ఈ కారణంగా ఇది నేరుగా స్వతంత్ర భారతదేశానికి వచ్చేది. దాంతో మిగిలిన 21 రాజ్యాలను విలీనం చేసి ‘రాజస్థాన్’ గా ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ రాజ్పుత్నా రాజ్యాల ఏకీకరణ ఏడు దశల్లో పూర్తయింది. దీనికి సుమారు 8 సంవత్సరాల 7 నెలల 14 రోజుల సమయం పట్టింది. రాజ్యాల ఏకీకరణ తర్వాత 1949 మార్చి 30 న రాజస్థాన్ రాష్ట్రం ఏర్పడింది.అందువల్ల మార్చి 30న రాజస్థాన్ అవతరణ దినోత్సవంగా అధికారికంగా జరుపుకుంటున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!