పీవీ నరసింహారావుకు భారతరత్న.. అవార్డు అందుకున్న కొడుకు ప్రభాకర్ రావు
- March 30, 2024
న్యూఢిల్లీ: పీవీ నరసింహారావు తరఫున ఆయన కుటుంబం భారతరత్నను స్వీకరించింది. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటిని ప్రదానంచేశారు. పీవీ తరఫున ఆయన తనయుడు ప్రభాకర్ రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈసారి భారతరత్న ఐదుగురికి ఇచ్చారు. కర్పూరీ ఠాకూర్, స్వామినాథన్, చరణ్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా భారతరత్నను స్వీకరించారు. ఈ నలుగురికి మరణానంతరం అవార్డు లభించడంతో వారి వారి కుటుంబ సభ్యులు స్వీకరించారు.
కర్పూరీ ఠాకూర్ తరఫున ఆయన తనయుడు రామ్‌నాథ్, చరణ్ సింగ్ తరఫున మనవడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరఫున కూతురు నిత్యారావు అవార్డులను స్వీకరించారు. రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బీజేపీ అగ్రనేత అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును ప్రదానం చేయనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!