‘తమ్ముడు’ నితిన్ మాస్ మ్యాజిక్ చేయబోతున్నాడుగా.!
- March 30, 2024
ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే నితిన్ బోలెడంత కంటెంట్ ఇచ్చేశాడు తన తాజా సినిమా ‘తమ్ముడు’కి. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తమ్ముడు’. నితిన్ హీరోగా రూపొందుతోన్న సినిమా ఇది.
తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమా పేరును తన సినిమాకి టైటిల్‌గా పెట్టుకున్నాడు. కాగా, ఈ రోజు నితిన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు.
పోస్టర్ విషయానికి వస్తే.. బోలెడంత కంటెంట్, ఇన్ఫామేషన్ ఇచ్చేశారు ఈ పోస్టర్‌తోనే. ఓ లారీ మీద కూర్చుని ఏదో సాధించాలన్న కసితో కనిపిస్తున్నాడు హీరో నితిన్.
అంతేకాదు, చేతిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధం కూడా వుంది. ఇక లారీ మీద పైడి తల్లమ్మ దీవెన, ఫుణ్యవతి అని పేర్లు రాసి వున్నాయ్. లారీని ఓ గిరిజన మహిళ నడుపుతోంది. లారీలో చాలా మంది ప్రయాణికులు కనిపిస్తున్నారు.
మొత్తానికి కథేంటీ.? అనే సంగతి పక్కన పెడితే, ఈ పోస్టర్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా వుంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన