సితారతో టిల్లుగాడు.! ఇంకోటి.!
- March 30, 2024‘డీజె టిల్లు’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టి, దానికి సీక్వెల్ అయిన ‘టిల్లు స్క్వేర్’తోనూ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ రెండు సినిమాలూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచే రూపొందాయి. రెండూ అనూహ్యమైన కలెక్షన్లు రాబట్టాయ్.
దాంతో, సితార ఎంటర్టైన్మెంట్స్ మరో సినిమాని సిద్దు జొన్నలగడ్డతో ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నామని నాగవంశీ చెబుతున్నారు.
బహుశా అది కూడా ‘డీజె టిల్లు’ సీక్వెల్ అని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో సినిమా వుండబోతోందని తెలుస్తోంది.
ఇక రీసెంట్గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’కి సంబంధించి మౌత్ టాక్ బాగానే వుండడంతో హాలీడేస్‌లో సినిమా బాగానే వర్కవుట్ అయ్యేలా వుంది.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా దూసుకెళ్తోంది. చూడాలి మరి, ఈ జోరు ఎన్ని రోజులుంటుందో.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్