నారా రోహిత్ మళ్లీ వస్తున్నాడు.!
- March 30, 2024కంటెంట్ వున్న కథలకు పెట్టింది పేరు హీరో నారా రోహిత్. చేసినవి తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే సినిమాలు చేశాడు. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించి తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు.
అయితే, ఈ మధ్య పెద్దగా నారా రోహిత్ సినిమాలు పాపులర్ కావడం లేదు. దాంతో కాస్త బ్రేక్ తీసుకున్నాడు. మళ్లీ ఇప్పుడే ఓ ప్రత్యేకమైన సినిమాతో రాబోతున్నాడు.
నారా రోహిత్ కెరీర్ తొలి నాళ్లలో చేసిన సినిమా ‘ప్రతినిధి’. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. అప్పటి రాజకీయ పరిస్థితుల్ని సూటిగా ఎత్తి చూపిన సినిమా ఇది. మీడియాని కూడా ఏకి పారేసింది.
అలాంటి కథనంతోనే ఆ సినిమాకి సీక్వెల్గా రాబోతోంది ‘ప్రతినిధి 2’. ఈ సినిమాతో రీపోర్టర్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.చిత్రానికి కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మాతలు.
‘ఈ దేశం అప్పు ఎంత.?’ ఇలాంటి ప్రశ్నలు హీరో నోటి వెంట ఈ సినిమా ద్వారా పలికించబోతున్నాడట మూర్తి. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు రేకెత్తిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం