కువైట్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు ఇఫ్తార్ విందు
- March 30, 2024
కువైట్ సిటీ: ఎన్నారై తెలుగుదేశం కువైట్ మరియు జనసేన కువైట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. అలాగే పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని కువైట్లో నివసిస్తున్న తెలుగు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఎర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు అధ్యక్షతన ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ అధ్య్యక్షులు మద్దిన ఈశ్వర్ నాయుడు ఘనంగా నిర్వహించారు. కుదరవల్లి సుధాకర రావు మాట్లడుతూ అన్న నందమూరి తారక రామారావు 1982 లో సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదల కోసం పెట్టిన పార్టీ అని అలాంటి పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసం శుక్రవారం రోజున, క్రైస్తవ సోదరుల ప్రముఖ పండుగ గుడ్ ఫైడే రోజున చేసుకోవటం చాలా సంతోషం అని అన్నారు. మద్దిన ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ త్వరలో మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో వీలైనవారందరూ పాల్గొని ఎన్.డి.యే. కూటమిని గెలిపించాలని, ఎవరైనా కొందరు ఎన్నికలకు వెళ్ళలేకపోతే వారు వాళ్ళ కుటుంభసభ్యులను, స్నేహితులను, చుట్టాలను ప్రభావితంచేసి కూటమి అభ్యర్దులను గెలిపించటానికి తమవంతు కృషిచేయాలని విఘ్నప్తి చేశారు. జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్స్ రామచంద్ర నాయక్ మరియు కాంచన శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో ఎన్.డి.యే. కూటమిని గెలిపించి సైకో పాలనకు చరమగీతం పాడాలని, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఒకదుర్మార్గుడి కబంద హస్తాల్లో ఇర్రుకుపోయిందని, దొంగ మద్యం, ఇసుక మాఫియా, గంజాయి రవాణా, వంటి అస్సాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మరిందని, వీటినుండి కాపాడాలంటే ఎన్.డి.యే. కూటమిని గెలిపించాలని కోరారు. మరో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ములకల సుబ్బారాయుడు మాట్లాడుతూ అభివృద్ది కావాలన్నా, రాష్ట్రరాజధాని కావాలన్నా, పరిశ్రమలు, ఐటి కంపెనీలు రావాలన్నా ఎన్.డి.యే. కూటమిని గెలిపించాలని విఘ్నప్తి చేశారు. ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ ఉపాధ్యక్షులు షేక బాషా విచ్చేసిన అందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అందరికి దన్యవాదములు తెలియచేశారు. చివరిగా కేక్ కట్ చేసి ఇఫ్తార్ విందుతో కార్యక్రమాన్ని ముగించారు.
ఈ కార్యక్రమానికి ఎన్నరై తెలుగు డేశం పార్టీ సీనియర్ నాయకులు ములకల సుబ్బారాయుడు, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి, ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ ఉపాధ్యక్షులు షేక్ బాషా, కోశాధికారి ఎనుగొండ నరసిమ్హ, సోషల్ మీడియా ఇంచార్జి విసిసుబ్బారెడ్డి, గవర్నరేట్ కో-ఆర్డినేటర్స్ ఈడుపుగంటి దుర్గా ప్రసాద్, పెంచల్ రెడ్డి, కుటుంబరావు, ముష్తాక్ ఖాన్, మరియు ముఖ్యనాయకులు పోలారపు బాబు నాయుడు, ములకల రవి, పద్మరాజు వేణు, శివ మద్దిపట్ల, నరేష్ సన్నపనేని, పెంచల్ సన్నపనేని మొదలగు వారు మరియు జనసేన నాయకులు గల్ఫ్ జాతీయ కన్వీనర్ కాంచన శ్రీకాంత్ బాబు, రామచంద్ర నాయక్, కువైట్ కన్వీనర్ ఆకుల రాజేష్, ఇమ్మిడిశెట్టి సూర్యనారయణ,వేణు, ఓబులేష్, చంద్రశేఖర్, తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన