‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..
- March 31, 2024
హైదరాబాద్: ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను డబ్ చేసి తెలుగులోకి కూడా తీసుకు రావడం ఆనవాయితీగా మారిపోయింది. 2018, ప్రేమలు సినిమాలు తెలుగులో రిలీజయ్యి సూపర్ హిట్స్ గా నిలిచింది.ఇక రీసెంట్ గా మలయాళంలో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ అయిన సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’. ఫిబ్రవరి 22న మలయాళంలో రిలీజయిన ఈ చిత్రం న్యూ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.
కేవలం 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి అదుర్స్ అనిపించింది.ఇక ఈ సినిమా ఇంతటి విజయం సాదించడడంతో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో ఏప్రిల్ 6న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. దీంతో నేడు ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సౌబిన్ సాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు.. పలువురు మలయాళ యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొంతమంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ట్రిప్ కి వెళ్లగా, అక్కడ ఓ గుహలోకి ప్రవేశం లేకపోయినా వెళ్తారు. ఆ గుహ లోపల ఓ లోయలో ఒక ఫ్రెండ్ పడిపోతే మిగిలిన వాళ్లంతా అతన్ని ఎలా బయటకు తీశారు అనే థ్రిల్లర్, ఫ్రెండ్షిప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన