హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్
- April 01, 2024
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర విమానయాన శాఖ. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆదివారం కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. విమాన సర్వీసు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్లు చెప్పారు.
ఈ క్రమంలో స్పందించిన కేంద్రమంత్రి సింధియా.. వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడినట్లు వివరించారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు అంటే మంగళవారం, గురువారం, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన