ఈద్ సెలవు ప్రయాణం.. టాప్ 10 గమ్యస్థానాలు
- April 01, 2024
దోహా: పవిత్ర రమదాన్ మాసం ముగుస్తున్న తరుణంలో ఖతార్‌లోని ప్రజలు తమ తదుపరి ప్రయాణ గమ్యాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఈద్ సెలవుల ప్రకటనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రావెల్ రంగ నిపుణులు ఈద్ అల్ ఫితర్ సెలవుల కోసం గమ్యస్థానాలను ఎంచుకోవడం మరియు ప్లాన్ చేయడం గురించి వివరాను అందించారు. మ్యాప్స్ మరియు వోగ్స్ హాలిడేస్‌లో ఆపరేషన్స్ డైరెక్టర్ హర్షద్ కమరుదీన్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఈద్‌కు సంబంధించిన దుబాయ్, టర్కీ, కజకిస్తాన్, అజర్బైజాన్, ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ మరియు థాయ్‌లాండ్‌లను అత్యధికంగా కోరుకునే ప్రదేశాలుగా ఉన్నాయని తెలిపారు. ఖతారీలు ఇస్తాంబుల్, ఫుకెట్, లండన్ మరియు పారిస్ వంటి గమ్యస్థానాలను ఇష్టపడుతుండగా.. నివాసితులు, ప్రవాసులు జార్జియా, కజాఖ్స్తాన్ మరియు అజర్బైజాన్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. విక్టోరియా ట్రావెల్స్‌లోని మార్కెటింగ్ ఆఫీసర్ అహ్మద్ మరూఫ్ మాట్లాడుతూ.. ఈద్ సెలవుల్లో దుబాయ్, కైరో, లండన్, పారిస్, జెనీవా మరియు వియన్నా వంటి నగరాల ప్రజాదరణను పొందాయన్నారు. ప్రముఖ ఈద్ హాలిడే డెస్టినేషన్‌లో ఒక వారం బస కోసం, బడ్జెట్ ట్రిప్‌లు సాధారణంగా QR4,000 నుండి QR6,000 వరకు ఉంటాయి. అయితే విలాసవంతమైన ప్రయాణ ఎంపికలు QR12,000 నుండి QR30,000 వరకు ఉంటాయి. హోటల్ వసతి మరియు విమాన ఎంపికల వంటి అంశాల ఆధారంగా ఈ ఖర్చులు మారుతూ ఉంటాయి. దాదాపు ఈ దేశాలన్నింటిలో వీసా-ఆన్-అరైవల్ ఏర్పాట్ల నుండి ఖతారీలు ప్రయోజనం పొందవచ్చు. ఈద్ అల్-ఫితర్ సెలవుల్లో సందర్శించడానికి టాప్ 10 సిఫార్సు చేయబడిన గమ్యస్థానాల జాబితాలో ఫిలిప్పీన్స్, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్ట్, టర్కీయే, అజర్బైజాన్, కజకిస్తాన్, జార్జియా, థాయిలాండ్, దుబాయ్ ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన