రామ్ గోపాల్ వర్మకి చెల్లలేదు కానీ.!
- April 01, 2024రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు సంచలనాత్మక చిత్రాలు తెరకెక్కించడం.. వాటితో వైరల్ అవుతుండడం అలవాటుగా చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే, ఈ మధ్య ఆయన ఆటలు సాగడం లేదు.
ఇటీవల ‘వ్యూహం’, ‘శపథం’ అనే రెండు సినిమాలు తెరకెక్కించారు. రెండింటినీ ఒకేసారి రిలీజ్ చేసి సంచలనమైపోవాలనుకున్నారు. కానీ, పప్పులుడకలే.! రెండు సినిమాలూ విడుదలకు నోచుకోలేదు.
కానీ, ‘వివేకం’ అనే సినిమా ఒకటి ప్రస్తుతం యూ ట్యూబ్‌లో సంచలనమవుతోంది. సైలెంట్‌గా యూ ట్యూబ్‌లోకి వచ్చేసిన ఈ సినిమా దివంగత వివేకానంద రెడ్డి బయోపిక్‌గా రూపొందింది.
డైరెక్టర్ ఎవరో తెలీదు, తారాగణం గురించి అంతకన్నా తెలీదు. కానీ, సినిమా మాత్రం సెన్సేషనల్ అవుతోంది సోషల్ మీడియాలో. దివంగత నేత వివేకానంద రెడ్డి హత్యోదంతం నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు వేడి వేడిగా వున్న తరుణంలో ఈ సినిమాని సోషల్ మీడియా ద్వారా వీక్షించే వీక్షకులు ఎక్కువయ్యారు
విడుదలైన తొలి రోజే 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించి ఈ సినిమా సంచలనమవుతోంది. సినిమా పూర్తిగా చూడకున్నా.. కొన్ని డైలాగులయితే, నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయ్. రామ్ గోపాల్ వర్మకి చెల్లదేదు కానీ, ఊరూ పేరు లేకున్నా ఈ డైరెక్టర్ ‘వివేకం’ సినిమాని భలే క్యాష్ చేసుకుంటున్నాడులే.!
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు