రాజమౌళి-మహేష్ మరో అప్డేట్ ఇదిగో.!
- April 01, 2024
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వుండబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథా నేపథ్యాన్ని అప్పట్లోనే రాజమౌళి రివీల్ చేశారు.
అడ్వెంచర్ థ్రిల్లర్‌గా సినిమా వుండబోతోందనీ, అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా కథ రెడీ అవుతోందనీ ఆయన తెలిపారు.
తాజాగా స్ర్కిప్టు వర్క్ పూర్తయిపోయిందట. రేపో మాపో కాస్టింగ్ వర్క్ కూడా ఫైనల్ చేసేస్తామని అంటున్నారు. ఇప్పటికే పలువురు ఆర్టిస్టులు ఫైనల్ అయ్యారన్న సమాచారం వున్నప్పటికీ అదంతా జస్ట్ ప్రచారమే అని తెలుస్తోంది.
ఫైనల్ వెర్షన్ కాస్టింగ్‌ని త్వరలోనే వెల్లడించనున్నారట. అలాగే, స్క్రిప్టు విషయానికి వస్తే, దక్షిణాప్రికా బ్యాక్ డ్రాప్లో కథ వుండబోతోందట. దక్షిణాఫ్రికా ఫేమస్ నవలా రచయిత అయిన విల్బర్ స్మిత్‌కి వీరాభిమాని కావడంతో, ఆయన నవలల ఆదారంగా ఈ సినిమాకి స్ర్కిప్టు సిద్ధం చేశారట విజయేంద్ర ప్రసాద్.
విజువల్స్ తెరపై అద్భుతహ.. అనేలా వుండబోతున్నాయట. మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా.. ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు