రిఫా లేబర్ క్యాంప్‌లో ఇఫ్తార్ ఫుడ్ పంపిణీ
- April 03, 2024
బహ్రెయిన్: బంగ్లాదేశ్ సొసైటీ.. బహ్రెయిన్, రిఫాలోని లేబర్ క్యాంప్‌లో అద్భుతమైన ఆరోగ్యకరమైన ఇఫ్తార్ ఆహార పంపిణీ చేసింది. జుఫైర్‌లో ఉన్న జుఫైర్ జూనియర్స్ అనే మామ్స్ అండ్ టోట్స్ గ్రూప్‌తో సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రవాసులలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి, రమదాన్ సందర్భంగా వినియోగించే సాంప్రదాయ, క్యాలరీలతో కూడిన ఇఫ్తార్ భోజనాలకు పోషకమైన ప్రత్యామ్నాయాలను అందించడం దీని లక్ష్యం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రవాస సమాజంలో పెరుగుతున్న అనారోగ్యం, మరణాల గురించి ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో హెల్తీ ఫుడ్ ను పంపిణీ చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో వివిధ రకాల పండ్లు, చికెన్ వెజిటబుల్ ఖిచురి, బహ్రెయిన్ గుడ్లు, పెరుగు పానీయాలు, జ్యూస్‌లతో సహా ఉపవాసం తర్వాత అవసరమైన పోషకాలను తిరిగి నింపడానికి రూపొందించిన అనేక రకాల వస్తువులను అందజేసారు.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'