కేజ్రీవాల్ ఆరోగ్యం పై స్పందించిన జైలు అధికారులు
- April 04, 2024
న్యూఢిల్లీ: జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని, ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. దీనిపై తీహార్ జైలు వర్గాలు స్పందించాయి. కేజ్రీవాల్ ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని, ఆయన కీలక ఆరోగ్య వ్యవస్థలన్నీ భేషుగ్గా ఉన్నాయని జైలు అధికారులు వెల్లడించారు.
కేజ్రీవాల్ ను తాజాగా ఇద్దరు వైద్యులు పరిశీలించారని…రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు, కీలక అవయవాల పనితీరు అంతా బాగుందని వారు తెలిపారని వివరించారు. అంతేకాదు, జైలుకు వచ్చేనాటికి కేజ్రీవాల్ 65 కిలోల బరువు ఉన్నారని, ఇప్పుడు కూడా అంతే బరువు ఉన్నారని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనకు ఇంటి నుంచి వస్తున్న భోజనాన్నే అందిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!