బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ మృతికి ఘన నివాళులు..
- June 05, 2016
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులతో పాటు ప్రముఖ వ్యక్తులు బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 74 ఏళ్ల ఈ గ్రేటెస్ట్ బాక్సర్ శుక్రవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అరిజోనా నుంచి కుటుంబసభ్యులు అలీ పార్థివ దేహాన్ని ఆదివారం లూయిస్‌విల్లేలోని స్వగృహానికి తరలించారు. వాస్తవానికి తాను చనిపోవడానికి కొన్నేళ్ల ముందే అంతిమయాత్ర ఎలా సాగాలో అలీ తన కుటుంబసభ్యులకు వివరించారట. ఆయన కోరిన విధంగానే ఈ కార్యక్రమాన్ని సాగించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.మరోవైపు ఆయన మృతికి సంతాపకంగా నగరంలో జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఆయన చిన్నతనంలో నివసించిన గృహం మొహమ్మద్ అలీ సెంటర్ ముందు అభిమానులు పుష్పగుచ్ఛాలను ఉంచి తమ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈనెల 10న (శుక్రవారం) ఆయన అంత్యక్రియలు జరపనున్నట్టు కుటుంబ అధికార ప్రతినిధి బాబ్ గన్నెల్ తెలిపారు. అంతకుముందు గురువారం కుటుంబసభ్యుల సమక్షంలో ప్రార్థనలు జరుగుతాయి. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇమాం ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలీ అంత్యక్రియల ప్రసారాన్ని విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే అవకాశం ఉంది. మరో 30 నిమిషాలు...: బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ చివరి క్షణాల గురించి అతని కూతురు హనా అలీ ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. అలీ శరీరంలో అన్ని భాగాలు పని చేయడం ఆగిపోయిన తర్వాత కూడా ఆయన గుండె మరో 30 నిమిషాలు కొట్టుకుందని ఆమె చెప్పింది. 'నాన్న చనిపోయే సమయంలో మేమంతా అక్కడే ఉన్నాం. వి లవ్ యూ అని చెప్పాం. ఆయన శరీరంలో అప్పటికే అన్ని అవయవాలు విఫలమైపోయాయి. అయితే హృదయం మాత్రం ఆగిపోలేదు. మరో 30 నిమిషాలు కొట్టుకుంటూనే ఉంది. ఇలాంటిది బహుశా ఎప్పుడూ జరిగి ఉండదు' అని హనా పేర్కొంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







