గీతాంజలి మళ్లీ వచ్చింది.! ఈ ప్రమోషన్ సరిపోతుందా.?

- April 06, 2024 , by Maagulf
గీతాంజలి మళ్లీ వచ్చింది.! ఈ ప్రమోషన్ సరిపోతుందా.?

తెలుగమ్మాయ్ అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి ఇంతవరకూ అయితే, పాజిటివ్ సైన్ కనిపించడం లేదు.
వచ్చే శుక్రవారం అనగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. పోస్టర్లు బాగా డిజైన్ చేసినప్పటికీ, ట్రైలర్ కట్ మాత్రం ఏమంత ఆకట్టుకోలేదు.
సో, ‘గీతాంజలి’ మళ్లీ వచ్చింది’ నిలదొక్కుకోవడం కష్టమేనేమో అన్న అనుమానాలొస్తున్నాయ్. అయితే, ప్రోమోలు కొన్ని సార్లు నిరాశపరిచినా.. రిలీజ్ తర్వాత రిజల్ట్ పాజిటివ్‌గా రావచ్చు. హాలీడేస్ సీజన్ ఎలాంటి సినిమా అయినా వర్కవుట్ అవుతుంది.
ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అసలు సిసలు పండగే మరి. ఇంకాస్త ప్రమోషన్ల విషయంలో గట్టిగా ప్రయత్నిస్తే ఫలితాలు మారే అవకాశాలున్నాయని సినీ మేథావులు అభిప్రాయపడుతున్నారు.
అయినా అక్కడున్నది కోన వెంకట్. సినిమాని మార్కెట్ చేసుకోవడంలో కోన వెంకట్ రూటే సెపరేటు. సో, ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ రిజల్ట్ ఎలా వుండబోతోందో చూడాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com