కువైట్‌లో చిత్రీకరించిన 'రోలెక్స్ - ది కామన్ మ్యాన్' విడుదల

- April 07, 2024 , by Maagulf
కువైట్‌లో చిత్రీకరించిన  \'రోలెక్స్ - ది కామన్ మ్యాన్\' విడుదల

కువైట్: కువైట్‌లో అధికారికంగా చిత్రీకరించబడిన మొదటి ఎక్స్‌పాట్ చిత్రం"రోలెక్స్ - ది కామన్ మ్యాన్" భారతదేశంలో విడుదలైంది. కువైట్‌కు చెందిన 'జెర్రీస్ జర్నీ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్'కి చెందిన జెర్రీ నిర్మించి మరియు దర్శకత్వం వహించారు. "రోలెక్స్ - ది కామన్ మ్యాన్" అనేది కుటుంబ మనోభావాలు, హృదయాలను కదిలించే చిత్రం.  భారతదేశంలోని చెన్నైలోని ప్రతిష్టాత్మక ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ థియేటర్‌లో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ షో జరిగింది.  కువైట్‌కు చెందిన వ్యాపారవేత్త, 'జెర్రీస్ జర్నీ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్'  జెర్రీ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..పూర్తిగా కువైట్‌లో సినిమాను రూపొందించాలనే తన కోరిక నెరవేరిందని అన్నారు. ఏప్రిల్ 19 నుండి ఓజోన్ సినిమాస్‌లో రెండు వారాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com