‘కిస్మత్’ .! బీటెక్ స్టూడెంట్స్ భవిష్యత్ ‘చిత్రం’.!
- April 08, 2024
బీటెక్ చేసిన కుర్రోళ్లు బయటికొచ్చాకా, వుద్యోగాలు దొరక్క పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. వింటుంటే కామెడీగా వుంటుంది కానీ, ఆ స్ర్టెస్ తీసుకుంటున్న కుర్రాళ్లకే అర్ధమవుతుంది ఆ బాధేంటో.
తాజాగా అలాంటి ఓ ముగ్గురు బీటెక్ కుర్రాళ్ల జీవితాన్ని సినిమాగా తెరపై ఆవిష్కరించాడు ఓ డైరెక్టర్. ఆ సినిమా పేరే ‘కిస్మత్’. ఫీజు రీఎంబర్స్మెంట్ మీద బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగం దొరక్క, ఇంట్లో తల్లిదండ్రుల పోరు పడలేక హైద్రాబాద్ చేరిన ఆ ముగ్గురు కుర్రోళ్లు చివరికి ఉద్యోగాలు సంపాదించారా.? అందుకోసం వారు పడిన పాట్లేంటీ.? కిస్మత్ వారిని ఎలా వరించింది.? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
అందుకోసం ధియేటర్లకు పోవాల్సిన పని లేదండోయ్. ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో వుంది. చిన్న బడ్జెట్లో సినిమాటిక్ అంశాలన్నీ జోడించి, కమర్షియల్ ఫార్మేట్‌లోనే ఈ సినిమాని వినోదాత్మకంగా తెరకెక్కించారు.
ఈ క్రైమ్ కామెడీ డ్రామాకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. నరేష్ అగస్త్య, అభినవ్ గోమటం, రియా సుమన్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాలో.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'