బాలయ్య-బాబీ ‘వీర మాస్’కి సై అంటే సై.!?
- April 08, 2024‘వాల్తేర్ వీరయ్య’ సినిమా తర్వాత దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం బాలయ్య 109 వ చిత్రం. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్లుగా మాస్ ఊర మాస్ అనేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు బాబీ.
‘వాల్తేర్ వీరయ్య’ వంటి సూపర్ హిట్ కొట్టిన బాబీ, ఆ హిట్టుని కంటిన్యూ చేసేలా ఈ సినిమా వుండాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు అన్నీ.
‘భగవంత్ కేసరి’ సినిమా తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం ఇదే. ఆ సినిమా యావరేజ్ అనిపించుకున్నా.. బాలయ్య ఇమేజ్ మాత్రం అలాగే వుంది.
ఇప్పుడు బాబీతో చేస్తున్న సినిమా కోసం కూడా బాలయ్య చాలా కష్టపడుతున్నాడట. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం బాబీ తన హిట్టు సెంటిమెంట్ కంటిన్యూ అయ్యేలా ఈ సినిమాకి టైటిల్ ప్లాన్ చేశాడనీ తెలుస్తోంది.
‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలోంచి ‘వీర’ తీసుకుని.. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్లుగా మాస్ చేర్చి.. ‘వీర మాస్’ అని వచ్చేలా టైటిల్ ఫిక్స్ చేశాడనీ ప్రచారం జరుగుతోంది.
దీనిపై అధికారిక ప్రకటన రావాలంటే ఉగాది వరకూ ఆగాల్సిందే. ఆ రోజు ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్లు ఇవ్వబోతున్నారట బాబీ అండ్ టీమ్.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు