1584 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- April 09, 2024
బహ్రెయిన్: హిస్ మెజెస్టి సింహాసనాన్ని అధిష్టించిన సిల్వర్ జూబ్లీని గుర్తు చేస్తూ.. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా బహ్రెయిన్ సాయుధ దళాల సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.. దోషులుగా తేలిన 1,584 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్, హెచ్‌ఎం రాజు రాయల్ డిక్రీని జారీ చేయడాన్ని ప్రశంసించింది. బహ్రెయిన్ లో సామాజిక నిర్మాణాన్ని పరిరక్షిస్తూ, ప్రజా ప్రయోజనాలను సమర్థిస్తూ, వ్యక్తిగత మరియు పౌర హక్కులను కాపాడుతుందని అభినందించింది. క్షమాభిక్ష పొందిన వ్యక్తులకు శిక్షణా కార్యక్రమాలను అందించాలని, ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచాలని కార్మిక మంత్రిత్వ శాఖను HRH ప్రిన్స్ సల్మాన్ ఆదేశించారు. ఈద్ ను పురస్కరించుకొని హెచ్‌ఎం కింగ్ హమద్.. బహ్రెయిన్ ప్రజలకు మరియు అన్ని అరబ్, ఇస్లామిక్ దేశాలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







