BAPS హిందూ మందిర్.. ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రారంభం
- April 10, 2024
అబుదాబి: BAPS హిందూ మందిర్ సందర్శకులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా యూజర్ ఫ్రెండ్లీ ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. హిందూ మందిర్ ప్రారంభమైనప్పటి నుండి వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాబోయే ఈద్, రామనవమి మొదలైన పండుగ సెలవుల సమయంలో రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సందర్శకుల కోసం కొత్త ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రక్రియ అమలు చేయనున్నట్లు మందిర్ ప్రతినిధి తెలిపారు. బుకింగ్ ప్రక్రియ ద్వారా సందర్శకులు వారి ప్రాధాన్యత తేదీ, సమయ స్లాట్‌ను ఎంచుకోవచ్చని, వేచి ఉండే సమయాన్ని తగ్గించవచ్చని , ఈ విధానం సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం, ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ కోసం https://www.mandir.ae/visitని సందర్శించాలని సూచించింది. సోమవారాల్లో BAPS హిందూ మందిర్ ప్రజలకు మూసివేయబడిందని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?