దశల వారీగా ఉద్యోగులను అమరావతికి తరలిస్తా0
- June 06, 2016
తాత్కాలిక సచివాలయ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. జూన్ 27లోగా సచివాలయ కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తయిన కార్యాలయాల్లోకి ఏయే విభాగాలు తరలించాలో నిర్ణయించి... వారికి ముందస్తు సమాచారం ఇస్తామన్నారు. అనంతరం మిగిలిన విభాగాలకు చెందిన ఉద్యోగులను దశల వారీగా అమరావతికి తరలిస్తామన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయానికి వచ్చే ఉద్యోగులకు వసతి సౌకర్యం కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలి సచివాలయ నిర్మాణ పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. గోడల నిర్మాణాలు, విద్యుత్, ఇతర సౌకర్యాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. వెలగపూడికి వచ్చే రహదారుల అభివృద్ధి పనులపైనా చర్చించారు.రాజధాని ప్రాంతంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనికోసం రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పరిశుభ్రత తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు. హైదరాబాద్‌ను 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినప్పటికీ... రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలన్న కారణంతోనే తాను ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నట్లు చెప్పారు. వేరే రాష్ట్రం నుంచి పరిపాలన సాగిస్తే ప్రజలకు తృప్తిగా ఉండదని... స్థానికంగా పాలన సాగితే ప్రజలకు న్యాయం చేసినట్లవుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్నందునే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







