అణగారిన వర్గాల మహాత్ముడు

- April 11, 2024 , by Maagulf
అణగారిన వర్గాల మహాత్ముడు

అతడు అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అప్పటి వరకు ఉన్న కుల నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించాడు. రైతులు మరియు ఇతర తక్కువ కులాల హక్కుల కోసం పోరాడాడు.భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకుడు, జీవితాంతం బాలికల విద్య కోసం పోరాడాడు అభాగ్యులైన పిల్లల కోసం అనాధ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ఆయన మరెవరో కాదు  దీనజనుల బాంధవుడిగా ప్రసిద్ది గాంచిన  మహాత్మా జ్యోతిబా పూలే. నేడు జ్యోతిబా పూలే జయంతి.

మహాత్మా జ్యోతిబా పూలే అని పిలవబడే జ్యోతిరావు గోవిందరావు ఫులే 1827 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో జన్మించారు. తండ్రి గోవిందరావు పూనాలో కూరగాయల వ్యాపారిగా జ్యోతిరావు పూలే కుటుంబం మాలి కులానికి చెందిన , వారి అసలు బిరుదు గోర్హ్‌ మాలను బ్రాహ్మణులు తక్కువ కులం గా పరిగణించారు. సామాజికంగా దూరంగా ఉంచారు జ్యోతిరావు పూలే తండ్రి, మేనమామ పూల వ్యాపారం చేసేవారు ఆ నేపథ్యంలోనే ఆ కుటుంబానికి పూలే అనే పేరు వచ్చింది. చిన్న వయస్సు నుంచే జ్యోతిరావు పూలేకు పుస్తక పఠనం అంటే ఆసక్తి ఎక్కువ. పూలే బాల్యంలోనే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించారు.
 
13 ఏళ్ల వయస్సులో జ్యోతిరావు పూలేకు 9 సంవత్సరాల సావిత్రి బాయితో వివాహం జరిగింది. పూలే 1848 ఆగస్టు నెలలో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడంతో బోధించటానికి ఉపాధ్యాయులు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు పూలే అతని భార్య సావిత్రి పిల్లలకు పాఠాలు బోధించారు. పూలే ఆ కాలంలో వితంతు పునర్వివాహాల గురించి ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చారు.
 
పూలే కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు. పూలే 1853 లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు.
 
1873 సెప్టెంబరు 24న , ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశారు. పూలే లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు. విద్య యొక్క విశిష్టతను  సమర్థించిన మొదటి సంస్కర్త జ్యోతిరావ్ పూలే.

తన జీవితం అంతా దోపిడీ నుండి అంటరాని వారిని విముక్తి కోసం అంకితం చేశారు సామాజిక కార్యకర్తగా సంస్కరణ కార్యకర్తగానే  కాకుండా వ్యాపారవేత్తగా కాంట్రాక్టర్‌ గా 1876 నుండి 1883 మధ్య పూనా మున్సిపల్‌ కమిషనర్‌ గా పనిచేశారు. సమాజం కోసం ఎన్నో మంచి పనులు చేసిన జ్యోతిరావ్ పూలే 1888లో పక్షవాతానికి గురై 1890 నవంబర్ 28వ తేదీన తుది శ్వాస విడిచారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com